Friday, 16 December 2016

Uthsaaha ganamu chesedhamu hosanna song

ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)

అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2)         ||హల్లెలూయ||

వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2)           ||హల్లెలూయ||

Idhigo deva naa jivitham

ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం        ||ఇదిగో||

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో||

Vinthaina tharaka vealasindhi gaganana

వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి     ||మనమంతా||

ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి        ||మనమంతా||

Rakshakudu udhayinchinadata

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||

దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||

గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు||

వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||

పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||

అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||

Jai jai yesaiah song by sharon sisters

జై జై జై యేసయ్యా
పూజ్యుడవు నీవయ్యా
ఈ లోకానికొచ్చావయ్యా
సంతోషం తెచ్చావయ్యా
మాకు సంతోషం తెచ్చావయ్యా (2)

కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)
పశుల పాకలో పశుల తొట్టిలో
పసి బాలుడుగా ఉన్నావయ్యా (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)        ||జై జై జై||

దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను
నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)
లోక రక్షకుడు జన్మించెనని
సంతోషముతో ఆనందముతో (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)         ||జై జై జై||

Aha annandhame maha santhoshame song by sharone sisters

ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||

యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||

మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)      ||ఆనందమే||

తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)          ||ఆనందమే||

Baludu kaadhammo balavanthdu yesu Christmas song

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2)          ||బాలుడు||

కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)         ||బాలుడు||

చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)          ||బాలుడు||

Randi randi randayo rakshakudu puttenu song by raj prakash paul

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)
రక్షకుని చూడను రక్షణాలు పొందను (2)        ||రండి||

యూదుల యూదట రాజుల రాజట (2)
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)
యూదుల యూదట రాజుల రాజట (2)
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)        ||రండి||

బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)        ||రండి||

సాతాను సంతలో సంతోషమేదిరా (2)
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2)
సాతాను సంతలో సంతోషమేదిరా (2)
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2)        ||రండి||

Sunday, 11 December 2016

Thara velasindhi satish kumar christmas song

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2)         ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే         ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే        ||తార||

Sunday, 27 November 2016

Worship song ardhana yesuna ke


ప:నీ చిత్తము నే చేసేదా
  నీ బాటలో నే నడిచేదా
  నీ వాక్యము లో  నే నిలిచెద
  నిను వెంబడిoచెద
  ఆరాధన యేసు నీకే "4"

చ:   గాలి నీరు అగ్ని నీ అద్భుత మాట కు
  లోబడుచునే ఉన్నవి అన్ని వేలలా.    "2"
నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్
చూచుచునే నడిచేదా అన్ని వేళల.  "2"

Wednesday, 28 September 2016

Kannu theristhe velugu raa

            Kannu theristhe velugu raa
ప..కన్నుతెరిస్తే  వెలుగు రా ...కన్ను మూస్తే చీకటిరా
నోరుతెరిస్తే శబ్దము రా...నోరు మూస్తే నిశ్శబ్దము రా
ఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం...

1.ఊయల ఊగితే జోలపాట రా
ఊయల ఆగితే ఏడుపు పాట రా
ఊపిరి ఆడితే ఉగిసలాట రా
ఊపిరి ఆగితే సమాధితోట రా
ఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం...

2.బంగారు ఊయల ఉగినా నీవు
భుజములపై నిన్ను మోయకతప్పదురా
పట్టు పరుపుపై నా పొర్లిన నీవు
మట్టి పరూపు లో నిన్ను పెట్టక తప్పదురా
ఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం...

Sunday, 25 September 2016

Konthasepu kanabadi anthalone mayamayye

Konthasepu kanabadi anthalone mayamayye
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యె 
ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు
మరణమైన జీవమైన నిమ్న విడువడు

1.ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో (2)
వచ్చేదెవరు నీతో మరణం వరకు (2)
ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవం నీకు        | |యేసే| |

2.చెమటోడ్చి సుఖము విడచి కష్టమునోర్చి ఆస్తులు సoపాదిరిచిన శాంతి వున్నదా (2)
ఈ రాత్రే దేవుడు వీ ప్రాణమడిగి తే(2)
సంపదాన ఎవరిదగునో యోచించితివా     | | యేసే | |

3,నీ శాపo తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)
విశ్రాంతి నియ్యగా నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యము చేసిన తప్పిoచుకొందువా | | యేసే | |

Saturday, 24 September 2016

Kanillatho pagilina gundetho alasinaa nesthamaa

Kanillatho pagilina gundetho alasinaa nesthamaa

ప.కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసినా నేస్తమా మనసున్న      మారాజు యేసు ని మదిలో నిలుపుమా "2"
విడువడు నిన్ను ఎదభాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును"2" ..విడువడు నిన్ను

1.రాతిరంత ఏడుపొచ్చిన కంట నీరు ఆగకుండిన
  కాలమింక మారకుందున వెలుగునీకు కలుగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమపంచిన పేరుపెట్టి నిన్ను పిలిచినా
నీ చేయి పట్టి విడచునా ఆనాధగా నిన్ను చేయునా

2.అంధకారం అడ్డువచ్చినా సంద్రంఎంత ఎత్తులేచినా
   నిరాశాలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
  భాధ కలుగు దేశమందున బంధకాలు ఊడకుందున
శత్రువెంత పగతో రగిలిన గిన్నె నిండి పొర్లకుంధునా

Chirakaala snehithudaa

                   Chirakaala snehitudaa

ప: చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్య నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్య ప్రియ ప్రభువా యేసయ్య
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం

1. బంధువులు వెలివేసిన-వెలివేయని స్నేహం లోకాన లేనట్టె ఓ దివ్య స్నేహం నాయేసుని స్నేహం చిరకాల స్నేహంఇది నా యేసు స్నేహం

2. కష్టాలలో కన్నీళ్లలో _ నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించునాయేసుని స్నేహం చిరకాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం

౩. నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహo

Nee chetilo rotteninenaiah

Neechethilo rottenu nenaia

ప.నీచేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్య..
విరువు యేసయ్య ..ఆ..ఆ..ఆశీర్వదించు యేసయ్య "2"

తండ్రి ఇంటినుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి
అబ్రహముగా మార్చితివి "2"

అల యాకోబు నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి
ఇశ్రాయేలుగా మార్చితివి "2"

హింసకుడు ధూషకుడు హానికరుడైన సాలు ను విరచితివి
పాలుగ మార్చితివి "2"

Wednesday, 21 September 2016

Raj prakash paul prardhana

నిన్ను నేను విడువనయ్య  నీదు ప్రేమన్ మరువనయ్య
నీ దయనోనే నన్ను బ్రతికించయ్య ,
నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య
జీవితమే నీదు వరమయ్య
నీదు మేలుల్ నేను మారువనయ్య

1.కష్టాలలో నేనుండ గా నావారే దూషించగా
వెధనతో చింతించగా దేవా "2"
నీవే నా ఆధారం నీవే నా ఆదరణ
నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య
నీవే నా సర్వం నీవే నా సకలం నీతోడుతోనే నన్ను
బ్రతికించయ్య

Mahimanvithudaa

1.అల్ఫా ఒమేగా

ప: అల్ప ఒమేగయైన మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా  "2"
రాత్రిలో కా౦ితి కిరణమా! పగటిలో కృపానిలయమా! ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా

నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్య "2"

1. కనికరపూర్ణుడా! నీ కృపబాహుళ్యమే ఉన్నతముగ నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముకకాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను   "2"
జీవి౦చెద నీ కొరకే _ హర్షిరిచెద నీలోనే "2"

2. తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశనిరాశల వలయాలు తప్పించి అగ్నిజ్వాలాగా నను చేసెను  "2"

నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే  "2"

3. నిజస్నేహితుడ! నీ స్నేహమాధుర్యమే శుభసూచనగా నను నిలుఫుటకు అ౦తులేని అగాధాలు దాటి౦చి _ అ౦ిదని శిఖరాలు ఎక్కి౦ిచెను   "2'
నా చెలిమి నీతోనె _ నా కలిమి నీలోనే"2"

2.నీతిన్యాయములు జరిగించే యేసయ్య

ప: నీతి న్యాయములు_ జరిగించు నా యేసయ్య నిత్యజీవార్ధమైనవి నీ శాసనములు
వృద్ది చేసితివి పరిశుద్ధ జనముగ నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్ధు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో

1. ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్దలమందు నా తోడై కాపాడుచున్నావునీవు "2"
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు "2"

2. పరిమళ వాసనగ వేను౦డుటకు
పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు "2"
ప్రగతి పధములో నను నడిపించి
ప్రఖ్యాతిని మ౦ిచి పేరును కలిగించువాడవు  "2"

3. నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబ౦ధనను నాతో స్ధిరపరచుచున్నావునీవు "2" మహిమగలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు  "2"


3.సృష్టి కర్తవయిన యెహోవా


ప: సృష్టికర్తవైన యెహోవా _ నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ 

మంటికి రూపమిచ్చినావు _ మహిమలో స్థానమిచ్చివావు 

నాలో నిన్నుచూసావు _ నీలో నన్ను దాచావు

నిస్వార్ధమైన నీ ప్రేమ _ మరణము కంటె బలమైనది నీ ప్రేమ "2" 


1. ఏ కాంతి లేని నిశీదిలో ఏ తోడు లేని విషాదఫు వీధులలో ఎన్నోఅపాయఫు అంచులలో _ నన్నాదుకున్న నాకన్న తండ్రివి "2"

యేసయ్య_ _ నను అనాధగా విడువక 

నీలాంజనములతో నాకు _ పునాదులు వేసితివి  "2"


2. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేది౦చగా నశించిపోతుప్న నన్ను వెదక వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి "2"

యేసయ్యా నను కృపతో బలపరచి 

ఉల్లాస వస్త్రములను నాకు ధరిరిపజేసితివి "2"


4.బహు ఘనుడైన యేసయ్య


ప. వెల్పులలో బహు ఘనుడా _ యేసయ్య నిను సేవించువారిని _ఘనపరతువు నిను ప్రేమిరిచువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు నీయందు భయభక్తీ గల వారికి శాశ్వత కృపనిచ్చెదపు 


1.సుందరుడైన యోసేఫును _ అంధకార బoధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు _ ఫలించెడి కొమ్ముగ చేశావు  "2" మెరుగుపెట్టె నను దాదాపు _ నీ అoబుల పొదిలో ` ఘనవిజయమునిచ్ఛుట కొరకు _ తగిన సమయములో  "2"


2.ఉత్తముడైన దావీదును _ ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని స్థితిలో నిలిపావు "2" 

విటువపెట్టి నను కొన్నావు _ నీ అమూల్య రక్తముతో నిత్య జీవమునిచ్తుట కొరకు _ మహిమ రాజ్యములో  "2"


3.పామరుడైన సీమోనును _ కొలతలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు_ విజ్ఞాన సంపదనిచ్చావు "2"

పేరుపెట్టె నను పిలిచావు' _“ నిను పోలినడుచుటకు చెప్పశక్యముకాని ప్రహర్షముతో _ నిను స్తుతించెదను "2"


5.మహిమా స్వరూపుడా

ప: మహిమ స్వరూపూడా_ మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు _ నా యేసయ్య_ నీకే స్తోత్రములు 


1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా _ అల్పరిచినావు "2"

నీ గాయములద్వారా స్వస్దతనోంది ఆనంచించెద నీలో నేను "2"


2. విరిగిన మనస్సు నలిగిన హృదయం నీ కిష్టమైన _ బలియాగములా "2"

నీ చేతితోనే _ విరిచిన రొట్జెవై ఆహారమౌదుసు అనేేకులకు "2"


3. పరిశుద్ధాత్మ ఫలములు పొoది పరిపూర్ణమైన _ జ్యేష్ఠుల సంఘమై "2"

సీయోనురాజా _ నీ ముఖము చూడ ఆశతో నేను _ వేచియున్నాను "2"


6.దయగల హృదయుడవు


ప: దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడూ ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవలు ఏర్పరచువాడవు 

సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును  "2"


1.సత్యస్వరూపి నీ దివ్యవాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు _ జీవన గమనము  "2"


శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో నింఫుచున్నావు దీవెనలతో ననునడుపుచున్నావు సమృద్దితో "2"


2.పరిశుద్ధుఢా నీ దివ్యయోచనలే నాకు _ ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు _ క్షేమాధారము "2"


విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతు నిను నిశ్చలమైన నిరీక్షణతో  "2"


3.పరిఫూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు _ జీవాహారము 

పరవాసిగ జీవించుటే నాకు _ నిత్య సంతోషము "2''

ఆశ్రయమైనది నీ నామము సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్య నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును "2"


7.నాలో జీవించుచున్న యేసయ్య

ప.జీవించుచుస్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు 


1.నేను నా సొత్తు కానే కాను క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను 

నాచిత్తమెస్నడునాలో నెరవేరలేదు యేసయ్య చిత్తమేనాలో నెరవేర్చుచున్నాడు "2"


2.యుద్దము నాది కానే కాదు యుద్ధము యేసయ్యదే నా పక్షమున "2"

జయమసలేనాది కానేకాదు యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు "2"


3.లోకమునాది కానే కాదు యాత్రికుడను పరదేసిని"2"

నాకు నివాసము లేవేలేదు యేసయ్య నివాసము నాకిచ్ఛినాడు"2" 












Monday, 19 September 2016

Thalavanchaku nesthama

1.తలవంచకు నేస్తమా
తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడియెడమలకు భేదం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈలోకం లో
ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో
నీవుకావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
నీవు మండలి ఓ జ్వాలాగా నీవు చేరాలి ఓ గమ్యము

Kannirelamma karuninchu yesu ninnu viduvabodu

Song.కన్నీరెలమ్మ కరుణించు యేసు నిన్ను
ప.కన్నీరెలమ్మ కరుణించు యేసు నిన్ను విడువాబోడమ్మ
కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువాబోడమ్మా
కరుణచూపి కలతమాన్పే  "2"
యేసే తొడమ్మా
1.నీకేమిలేదని ఏమితేలేదని అన్నారనిన్ను అవమాన పరిచార
తలరాత ఇంతేనని తరవాత ఏమౌనోనని రెపటిని గూర్చి చింతించుచున్నవా

Priyamaina yesaiah

      ప్రియమైన యేసయ్య

 ప.  ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమే
   ప్రియమార నిన్ను చూడని 
   ప్రియమైన యేసయ్య  ప్రేమకే రూపమే 
   ప్రియమైన నీతో ఉండని   "2"
  నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా  "2"
  ఆనందము సంతోషంము నీవే  నయా
  ఆశ్చర్యము నీ ప్రేమయే  నా యెడ  "2"

1.జుంటేతెన ధారాలకన్న మధురమైన నీ ప్రేమను అతిసుందమయిన నీరూపును మారువలెను దేవా  "2"

Most memorable Christian songs

1.అన్ని నామములకన్నా పై నామం యేసు నామం

ప: అన్ని నామముల కన్నపై నామము _ యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయ౦ లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ హల్లెలూయ ఆమెన్‌
1. పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్యనరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము
2. శరీర వ్యాధులన్ని బాగుచేయును నజరేయుడైన యేసు నామము సమస్త భాదలన్ని తొలగించును అభిషిక్తుడగు క్రీస్తునామము

Saturday, 17 September 2016

Aparaadhini yesaiah

ఫ: అపరాధిని యేసయ్య _ క్రుపజూపి బ్రోవుమయ్య నేపమెంచకయె నీ కృపలో _ అపరాధములమ క్షమీంచు
.
1. సిలువకు నిను నే గిట్టితిని _ తులువతో జేరితిని కలుషంబులను మోపితిని _ దోషుండ నేను ప్రభువా

2. ప్రక్కలో బల్లెపుపోటు _ గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని _ మక్కువ జూపితివయ్య.

3. ముళ్ళతో కిరిటంబు _ నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె _ చల్లనిదయగల తండ్రి.

4. దాహంబు గొనగా చేదు _ చిరకను ద్రావనిడితి ద్రోహుండనై గొట్టితిని _ దేహంబు గాయములను.

5. కొరడాలతో కొట్టితిని _ నేరంబులను జేసితిని క్రూరురిడనై గొట్టితిని _ ఘోరంబు పాపిని దేవా.

6. చిందితి రక్తము నాకై _ పొందిన దెబ్బలచేత నిందలు పెట్టితినయ్య _ సందేహమేలనయ్య.

7. శిక్షకు పాత్రుడనయ్య _ రక్షణ తెచ్చితివయ్య అక్షయభాగ్యమునియ్య _ మోక్షంబు జూపితివయ్య,

Sunday, 11 September 2016

Thejomayuda

కృపా ఖేమము నీ శాశ్వత జీవము నా జీవిత కలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవసించనా నీ కృపతో నే పరవసించనా "2"

1.నా ప్రతి ప్రార్ధకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దివేనలయినాయి
"2"
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసము నిచ్చి విజయము చేకూర్చెను  "2"
నీ వాక్యమే మకారందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ..ఆరాధన నీకే  "2"

2.నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమలింపచేసి సాక్షిగా నిలిపాయి "2"
కలత చెందక నడిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చేను
ఆరాద్యుడా .....అభిషిక్తుడా ..ఆరాధన నీకె
నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే..ఆరాధన నీకే "2"

3.నా ప్రాణ ప్రియుడా నన్ను ఏలు మహారాజ
నాహృది నీకొరకు పదిల పరచితిని "2"
బూర శబ్దము వినగా నాబ్రతుకులో కళలు పండగ
ఆవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరేనా "2"
ఆరాద్యుడా .....అభిషిక్తుడా ..ఆరాధన నీకె
నా యేసయ్య ప్రాణేశ్వర ఆరాధన నీకే ఆరాధన నీకే "2"
Video link-https://m.youtube.com/watch?v=9dr57qSjgg0
2.సర్వోన్నతుడా
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము
ఎవ్వరులేరు నాకు ఇలలో
ఆదరణ నీవేగ ఆనందం నీవేగా "2"

1.నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యహోషువా తో  "2"
వాగ్దానము చేసినవు
వాగ్ధాన భూమిలో చేర్చినావు "2"

2.నిందలపాలై నిత్యనిబంధన
నీతో చేసిన దానియేలుకు "2"
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్ల ను మూసినావు "2"

3.నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పాలు కు "2"
విశ్వాసము కాచినావు
జయజీవితము నిచ్చినవు "2"
Video link-https://m.youtube.com/watch?v=6VSsRDPMdD0
3.యేసయ్య ఘనకార్యములు
నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు
కారుఛీకటిలో కలువరి కిరణమై
కఠినహృదయమును కరిగించినవు
నీ కార్యములను వివరింపతరమా?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా?

1.మనసులో నెమ్మది కలిగించుటకు
మంచువాలే కృపను కురిపించితివి "2"
విచారములు కొట్టివేసి విజయనందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువగలభూమిగా మర్చినవు "2"

2.విరజిమ్మే ఉదయకాంతిలో
నీరీక్షణ ధైర్యమును కలిగించి  "2"
అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభము పై నను నిలిపినావు"2"

3.పవిత్రురాలయిన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు
పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు "2"
సిద్ధ పడుచున్న వధువుగా చేసి సుగుణాలసన్నిధిలో నను నిలిపినవు "2"
Video link-https://m.youtube.com/watch?v=Eqci0CrGX-U
4.కనికరాపూర్ణుడ యేసయ్య

యేసయ్యాకని’కర పూర్ణుడ
మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సoతోషగానము _ సర్వసoపదల'కు ఆధారము  "2"

1.నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివినను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి "2"
.సిలువ మానుపై రక్తము కార్ఛి రక్షించితివిశాశ్వత కృపపాంది జీవింతును ఇల నీకొరకె  "2"

2.నా కొరకు సర్వము ధారాయుం దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి  "2"
అలసినవారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపాపొంది ఆరాధింతునుఅనుక్షణము "2"

3.నీవలన భాలమునొందిన వారే ధన్యులు
నీసన్నిధియయిన సీయోనులో వారు నిలచెదరు "2"
నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు
నిత్యము కృపాపొంది సేవంచెదను తుదివారకు "2"
Video link-https://m.youtube.com/watch?v=qCJxAl_lnq0

5.ఆత్మీయ యాత్ర

పల్లవి" నాఆత్మీయయాత్రలోఅరణ్యమార్గములో నాకు తోడైననాయేసయ్యానినుఆనుకొనిజీవించెద 
నేనేలభయపడుదునావెంటనీవుండగా నేనెన్నడుజడెయనునాప్రియుడానీవుండగా

    
1. శ్రేష్ఠమైన నీ మార్గములో నిత్వమైన నీబాహువుచాపి 
సమృద్ధిజీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన నా యేసయ్య
నిను హత్తు కొనగా నేటివరకు నేను సజీవుడను

2, పక్లీరాజువలెపైకెగురుటకునూతనబలముతో నింపితివి
జ్యేష్ఠుల సంఘములోననుచేర్చి పరిశుధ్ధపరచేయేసయ్యా 
అనుదినము నిన్నుస్తుతిoచుటకునేను జీవింతును 

3.సీయోను దర్శనము పొందుటకు ఉన్నతపిలుపుతో పిలిచితివి
కృపావరములతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్య
నీరాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్మూ
Video link-https://m.youtube.com/watch?v=8aWj_RTX9rY

     6.   మధురమైన యేసు చరితం

 మధురం మధురం నా ప్రియ యేసుని చరితo మధురం శాశ్వతంశాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరo దీనమనసు దయగల మాటలు _ సుoదరపదనమే తేజోమయుని రాజసం ‘ 

1.ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి 
చీకటిలోనుస్నవారిని బంధింపబడియున్న వారిని
విడుదల చేయుటకు `"2"
 నిరీక్షణ కలిగించి వర్దిల్లజేయుటకు _ యేసే సరిపాటి _ నా“ యేసే పరిహరి "2"

2.పరిపూర్ణమైన నెన్ముదినిచ్చుటకు చింతలన్నియు బాపుటకు . ప్రయాసపడువారి భారము తొలగించుటకు ’ 
ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహరి

3.కలవరపరచె శోధనలెదురైన 
కృంగదీపే భయములైనను 
ఆప్యాయతలు కరువైన _ ఆల్మీయులు దూరమైన 
జడెయకు నీవు మహిమతో నిలుపుటకు 
యేసే సరిపాటి నా యేపే పరిహారి
Video link-https://m.youtube.com/watch?v=svPPonnAImM

7.నమ్మదగిన సహాయుడు

నమ్మదగినవాడవు సహాయుడవు యేసయ్య ఆపత్కాలము లో ఆశ్రయమైనది నీవెనయ్య
చేరనుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వస్త్యమును

1.నీజనులను నీవు న్యాయాధిపతివైతివ శేత్రువుల కోటలన్ని కూలిపోయేను
సంకెళ్ళ సంబరాలు ముగబోయేనునీరీక్షన కర్తవైనా నీన్నె నమ్మిన ప్రజలు
నిత్యానంద బరితులయి సియోనుకు తిరిగివచ్చెను

2.నీప్రియులను నీవు కాపాడే మంచి కాపరి జఠిలమైన త్రోపలన్ని దాటీంచితివి సంమృధీ జీవముతో పోషించితివి ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా నిత్యదరణను పొంది నిే క్రియలను వివరించెను ' 

3. నా బలహీనతయయు శ్రేష్ఠమైన కృపనిచ్చితివిి యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి అర్హమైన పాత్రగా నను నిలుపుకొంటెవి ఆదరణకర్తవై విడువక తోడైనిలిచి సర్వోత్తమమైన మార్గములో నడెపించుము
Video link-https://m.youtube.com/watch?v=Sl835KypEqk



Saturday, 10 September 2016

Hosanna songs

       1.స్తుతుల సింహాసనం

కృపామయుడా నీలోనా
నివసింపచేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం- నీలో

1.ఏ అపాయము నా గుడారము సమీపించనియక "2"
నా మార్గములన్నింటిలో నీవే
నా ఆశ్రయమైనందున   "2"

2.చీకటి నుండి వెలుగులోకి
నన్ను పిలచిన తేజోమయా "2"
రాజవంశములో -యజకత్వము చేసేదను "2"

3.నీలో నిలిచి ఆత్మఫలములు
ఫలించుట కొరకు "2"
నాపైన నిండుగా -ఆత్మవర్షము కుమ్మరించు "2"

4.ఏ యోగ్యత లేని నాకు
జీవకిరీటం మిచ్చుటకు "2"
నీ కృపానను వీడక -శాశ్వత కృపగా మారెను "2"

     Song 2
ప: సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశము లో కనుపించె ఈమె ఎవరు?

1. ఆత్మల భార౦ _ ఆత్మాభిషేకంఆత్మ వరములు కలిగియున్న మహిమ గలిగిన _ సంఘమే

2. జయ జీవితము _ ప్రసవించుటకై వేదన పడుచు _ సాక్షియైయున్న కృపలో నిలిచియున్న సంఘమే

3. ది అపోస్తుల _ ఉపదేశమునే మకుటముగా ధరించియున్న క్రొత్త నిబంధన _ సంఘమే

Song -3
ప: షారోను వనములో పూసిన ఫుష్పమై లోయలలో పుట్టిన వల్లీపద్మమునై
నీ ప్రేమాతిశయమువే నిత్యము కీర్తించుచు ఆనందమయమై నన్నె మరచితిని

1. సుకుమారమైన వదనము నీది స్ఫటికము వలె ఛల్లనైన హృదయము నీది మధురమైన నీ మాటల సవ్వడి వినగా నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండెనే ప్రభువా నిన్నుచేరనా

2. సర్వోప్నతమైన రాజ్యము నీది సొగసైన సంబరాల నగరము నీది న్యాయమైన నీ పాలన విధులు చూడగా నిన్ను చేర జనసంద్రము ఆశ చెందనేే ప్రభువా నిన్ను మరతునా

౩. సాత్వీకమైన పరచఠ్యలు నీవి సూర్యకాంతిమయమైన వరములు నీవి పరిమళించు పుష్పమువై నిన్ను చూపనా ప్రీతి పాత్రవై భువిలో నిన్నే చాటనా ప్రభువా కృపతో నింఫుమా 
     
Song-4
ప: సర్వాంగ సుందరా సద్గుణశేఖరా యేసయ్యానిన్ను సీయోనులో చూచెద పరవశించి పాడుచూ పరవళ్లు త్రొక్కెద 

1. నా ప్రార్ధన ఆలకిరిచువాడా 
నా కన్నీరు తుడుచువాడా 
నా శోధనలన్నిటిలో ఇమ్మానియేలువై నాకు తోడై నిలిచితివా 

2. నా శాపములు బాపివావా 
నా ఆశ్రయఫురమైతివా 
 నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా 

3. అక్కరలు తీర్చినావా 
నీ రెక్కల నీడకు చేర్చివావా 
 అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై నాకు జయధ్వజమైతివా 


Wednesday, 7 September 2016

Christian song enaleni prema song

Enaleni prema na paina chupi ni varasuniga chesinavu       "2"
Ni prema nenu chatedhan na sarvam neve yesaiah "2"
Na sikshaku prathiga pranam pettina deva ni satya margamulo nanu nadipina prabhuva
Ni krupachetha rakshinchinave ni runamu ne therchagalana "2"
Thandri leni naku parama thandrivi nivai ontarinai unna natho nenunna nani annavu
Kanniru thudach nannadharinchina aa jali ne maruvagalana "2"

Video link-https://m.youtube.com/watch?v=wMUkybYUZTw

 ఎనలేని ప్రేమ నాపైన చూపి నీవరసునిగా చేసినావు
 నీప్రేమ నేను చాటేధన్ నా సర్వం నీవే యేసయ్య  "2"

1.నా శిక్షకు ప్రతిగా ప్రాణం పెట్టిన దేవా
నీసత్య మార్గము లో నను నడిపిన ప్రభువా
నీకృప చేత రక్షించినావే నీ ఋణము నే తేర్చగలన "2"

2.తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై ఒంటరి నై ఉన్న
 నాతో నేనున్నా నాని అన్నావు
కన్నీరు తుడచి నన్నదరించిన నీరుణము నే తేర్చగలన "2"