Saturday, 17 September 2016

Aparaadhini yesaiah

ఫ: అపరాధిని యేసయ్య _ క్రుపజూపి బ్రోవుమయ్య నేపమెంచకయె నీ కృపలో _ అపరాధములమ క్షమీంచు
.
1. సిలువకు నిను నే గిట్టితిని _ తులువతో జేరితిని కలుషంబులను మోపితిని _ దోషుండ నేను ప్రభువా

2. ప్రక్కలో బల్లెపుపోటు _ గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని _ మక్కువ జూపితివయ్య.

3. ముళ్ళతో కిరిటంబు _ నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె _ చల్లనిదయగల తండ్రి.

4. దాహంబు గొనగా చేదు _ చిరకను ద్రావనిడితి ద్రోహుండనై గొట్టితిని _ దేహంబు గాయములను.

5. కొరడాలతో కొట్టితిని _ నేరంబులను జేసితిని క్రూరురిడనై గొట్టితిని _ ఘోరంబు పాపిని దేవా.

6. చిందితి రక్తము నాకై _ పొందిన దెబ్బలచేత నిందలు పెట్టితినయ్య _ సందేహమేలనయ్య.

7. శిక్షకు పాత్రుడనయ్య _ రక్షణ తెచ్చితివయ్య అక్షయభాగ్యమునియ్య _ మోక్షంబు జూపితివయ్య,

No comments:

Post a Comment