Wednesday, 21 September 2016

Mahimanvithudaa

1.అల్ఫా ఒమేగా

ప: అల్ప ఒమేగయైన మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా  "2"
రాత్రిలో కా౦ితి కిరణమా! పగటిలో కృపానిలయమా! ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా

నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్య "2"

1. కనికరపూర్ణుడా! నీ కృపబాహుళ్యమే ఉన్నతముగ నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముకకాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను   "2"
జీవి౦చెద నీ కొరకే _ హర్షిరిచెద నీలోనే "2"

2. తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశనిరాశల వలయాలు తప్పించి అగ్నిజ్వాలాగా నను చేసెను  "2"

నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే  "2"

3. నిజస్నేహితుడ! నీ స్నేహమాధుర్యమే శుభసూచనగా నను నిలుఫుటకు అ౦తులేని అగాధాలు దాటి౦చి _ అ౦ిదని శిఖరాలు ఎక్కి౦ిచెను   "2'
నా చెలిమి నీతోనె _ నా కలిమి నీలోనే"2"

2.నీతిన్యాయములు జరిగించే యేసయ్య

ప: నీతి న్యాయములు_ జరిగించు నా యేసయ్య నిత్యజీవార్ధమైనవి నీ శాసనములు
వృద్ది చేసితివి పరిశుద్ధ జనముగ నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్ధు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో

1. ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్దలమందు నా తోడై కాపాడుచున్నావునీవు "2"
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు "2"

2. పరిమళ వాసనగ వేను౦డుటకు
పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు "2"
ప్రగతి పధములో నను నడిపించి
ప్రఖ్యాతిని మ౦ిచి పేరును కలిగించువాడవు  "2"

3. నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబ౦ధనను నాతో స్ధిరపరచుచున్నావునీవు "2" మహిమగలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు  "2"


3.సృష్టి కర్తవయిన యెహోవా


ప: సృష్టికర్తవైన యెహోవా _ నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ 

మంటికి రూపమిచ్చినావు _ మహిమలో స్థానమిచ్చివావు 

నాలో నిన్నుచూసావు _ నీలో నన్ను దాచావు

నిస్వార్ధమైన నీ ప్రేమ _ మరణము కంటె బలమైనది నీ ప్రేమ "2" 


1. ఏ కాంతి లేని నిశీదిలో ఏ తోడు లేని విషాదఫు వీధులలో ఎన్నోఅపాయఫు అంచులలో _ నన్నాదుకున్న నాకన్న తండ్రివి "2"

యేసయ్య_ _ నను అనాధగా విడువక 

నీలాంజనములతో నాకు _ పునాదులు వేసితివి  "2"


2. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేది౦చగా నశించిపోతుప్న నన్ను వెదక వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి "2"

యేసయ్యా నను కృపతో బలపరచి 

ఉల్లాస వస్త్రములను నాకు ధరిరిపజేసితివి "2"


4.బహు ఘనుడైన యేసయ్య


ప. వెల్పులలో బహు ఘనుడా _ యేసయ్య నిను సేవించువారిని _ఘనపరతువు నిను ప్రేమిరిచువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు నీయందు భయభక్తీ గల వారికి శాశ్వత కృపనిచ్చెదపు 


1.సుందరుడైన యోసేఫును _ అంధకార బoధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు _ ఫలించెడి కొమ్ముగ చేశావు  "2" మెరుగుపెట్టె నను దాదాపు _ నీ అoబుల పొదిలో ` ఘనవిజయమునిచ్ఛుట కొరకు _ తగిన సమయములో  "2"


2.ఉత్తముడైన దావీదును _ ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని స్థితిలో నిలిపావు "2" 

విటువపెట్టి నను కొన్నావు _ నీ అమూల్య రక్తముతో నిత్య జీవమునిచ్తుట కొరకు _ మహిమ రాజ్యములో  "2"


3.పామరుడైన సీమోనును _ కొలతలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు_ విజ్ఞాన సంపదనిచ్చావు "2"

పేరుపెట్టె నను పిలిచావు' _“ నిను పోలినడుచుటకు చెప్పశక్యముకాని ప్రహర్షముతో _ నిను స్తుతించెదను "2"


5.మహిమా స్వరూపుడా

ప: మహిమ స్వరూపూడా_ మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు _ నా యేసయ్య_ నీకే స్తోత్రములు 


1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా _ అల్పరిచినావు "2"

నీ గాయములద్వారా స్వస్దతనోంది ఆనంచించెద నీలో నేను "2"


2. విరిగిన మనస్సు నలిగిన హృదయం నీ కిష్టమైన _ బలియాగములా "2"

నీ చేతితోనే _ విరిచిన రొట్జెవై ఆహారమౌదుసు అనేేకులకు "2"


3. పరిశుద్ధాత్మ ఫలములు పొoది పరిపూర్ణమైన _ జ్యేష్ఠుల సంఘమై "2"

సీయోనురాజా _ నీ ముఖము చూడ ఆశతో నేను _ వేచియున్నాను "2"


6.దయగల హృదయుడవు


ప: దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడూ ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవలు ఏర్పరచువాడవు 

సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును  "2"


1.సత్యస్వరూపి నీ దివ్యవాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు _ జీవన గమనము  "2"


శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో నింఫుచున్నావు దీవెనలతో ననునడుపుచున్నావు సమృద్దితో "2"


2.పరిశుద్ధుఢా నీ దివ్యయోచనలే నాకు _ ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు _ క్షేమాధారము "2"


విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతు నిను నిశ్చలమైన నిరీక్షణతో  "2"


3.పరిఫూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు _ జీవాహారము 

పరవాసిగ జీవించుటే నాకు _ నిత్య సంతోషము "2''

ఆశ్రయమైనది నీ నామము సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్య నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును "2"


7.నాలో జీవించుచున్న యేసయ్య

ప.జీవించుచుస్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు 


1.నేను నా సొత్తు కానే కాను క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను 

నాచిత్తమెస్నడునాలో నెరవేరలేదు యేసయ్య చిత్తమేనాలో నెరవేర్చుచున్నాడు "2"


2.యుద్దము నాది కానే కాదు యుద్ధము యేసయ్యదే నా పక్షమున "2"

జయమసలేనాది కానేకాదు యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు "2"


3.లోకమునాది కానే కాదు యాత్రికుడను పరదేసిని"2"

నాకు నివాసము లేవేలేదు యేసయ్య నివాసము నాకిచ్ఛినాడు"2" 












No comments:

Post a Comment