Saturday, 10 September 2016

Hosanna songs

       1.స్తుతుల సింహాసనం

కృపామయుడా నీలోనా
నివసింపచేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం- నీలో

1.ఏ అపాయము నా గుడారము సమీపించనియక "2"
నా మార్గములన్నింటిలో నీవే
నా ఆశ్రయమైనందున   "2"

2.చీకటి నుండి వెలుగులోకి
నన్ను పిలచిన తేజోమయా "2"
రాజవంశములో -యజకత్వము చేసేదను "2"

3.నీలో నిలిచి ఆత్మఫలములు
ఫలించుట కొరకు "2"
నాపైన నిండుగా -ఆత్మవర్షము కుమ్మరించు "2"

4.ఏ యోగ్యత లేని నాకు
జీవకిరీటం మిచ్చుటకు "2"
నీ కృపానను వీడక -శాశ్వత కృపగా మారెను "2"

     Song 2
ప: సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశము లో కనుపించె ఈమె ఎవరు?

1. ఆత్మల భార౦ _ ఆత్మాభిషేకంఆత్మ వరములు కలిగియున్న మహిమ గలిగిన _ సంఘమే

2. జయ జీవితము _ ప్రసవించుటకై వేదన పడుచు _ సాక్షియైయున్న కృపలో నిలిచియున్న సంఘమే

3. ది అపోస్తుల _ ఉపదేశమునే మకుటముగా ధరించియున్న క్రొత్త నిబంధన _ సంఘమే

Song -3
ప: షారోను వనములో పూసిన ఫుష్పమై లోయలలో పుట్టిన వల్లీపద్మమునై
నీ ప్రేమాతిశయమువే నిత్యము కీర్తించుచు ఆనందమయమై నన్నె మరచితిని

1. సుకుమారమైన వదనము నీది స్ఫటికము వలె ఛల్లనైన హృదయము నీది మధురమైన నీ మాటల సవ్వడి వినగా నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండెనే ప్రభువా నిన్నుచేరనా

2. సర్వోప్నతమైన రాజ్యము నీది సొగసైన సంబరాల నగరము నీది న్యాయమైన నీ పాలన విధులు చూడగా నిన్ను చేర జనసంద్రము ఆశ చెందనేే ప్రభువా నిన్ను మరతునా

౩. సాత్వీకమైన పరచఠ్యలు నీవి సూర్యకాంతిమయమైన వరములు నీవి పరిమళించు పుష్పమువై నిన్ను చూపనా ప్రీతి పాత్రవై భువిలో నిన్నే చాటనా ప్రభువా కృపతో నింఫుమా 
     
Song-4
ప: సర్వాంగ సుందరా సద్గుణశేఖరా యేసయ్యానిన్ను సీయోనులో చూచెద పరవశించి పాడుచూ పరవళ్లు త్రొక్కెద 

1. నా ప్రార్ధన ఆలకిరిచువాడా 
నా కన్నీరు తుడుచువాడా 
నా శోధనలన్నిటిలో ఇమ్మానియేలువై నాకు తోడై నిలిచితివా 

2. నా శాపములు బాపివావా 
నా ఆశ్రయఫురమైతివా 
 నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా 

3. అక్కరలు తీర్చినావా 
నీ రెక్కల నీడకు చేర్చివావా 
 అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై నాకు జయధ్వజమైతివా 


No comments:

Post a Comment